Call us : 8106119311-Branches-Anantapur-Kadapa-Tirupati,

Marriage Registration

హైదరాబాద్/ ఆంధ్రజ్యోతి ప్రత్యేకం : మీరు వివాహం చేసుకోబోతున్నారా..? లేదా మీకు తెలిసిన వారు వివాహం చేసుకోబోతున్నారా..? అయితే జరగబోయే వివాహానికి చట్టబద్ధత కల్పించుకోమని వారికి మీ మాటగా చెప్పండి.. గతంలో పెళ్లి పత్రికలు, ఫోటోలు వివాహానికి ఆధారంగా ఉండేవి. అయితే వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రే‌షన్‌ చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. వివాహాల అధికారి ధృవీకరిస్తూ ఇచ్చే వివాహ నమోదు పత్రం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడనుంది. 
 
              ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వివాహాల నమోదు చట్టం-2002 రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు వర్తిస్తుంది. ఈ చట్టంలోని 8వ సెక్షన్‌ రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేస్తోంది. ఈచట్టాన్ని 2002, మే 21న రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించగా, 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో వివాహాల రిజిస్ట్రా‌రర్‌ జనరల్‌ ఉంటారు. అన్ని జిల్లాలకు వివాహాల రిజిస్ట్రార్‌లు ఉంటారు. నిర్ణయించిన సంఖ్యలో అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్లు జిల్లాల్లో ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్‌ జనరల్‌ జారీచేసే నిబంధనలకు లోబడి, జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత జిల్లాల రిజిస్ట్రార్లపైనే ఉంటుంది. వివాహాల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రతిజిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని పరిధిలో ప్రాంతాలవారీగా వివాహాల అధికారులు ఉంటారు. గ్రామాల్లో గ్రామకార్యదర్శి, మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో సంబంధిత మునిసిపల్‌ కమిషనర్లు వివాహాల అధికారులుగా వ్యవహరిస్తారు. వారు తమ ప్రాంతంలోని వివాహాల రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో నిర్దేశించిన వేళల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఆ కార్యాలయ పని రోజులు, వేళలు నోటీసు బోర్డుపై అందరికీ కనిపించేలా పెట్టాలి.
 
ఎలా నమోదు చేసుకోవాలంటే..?!
  • వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు పెళ్లి కుమారుడు, కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకులైనా వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందజేయాలి.
  • దరఖాస్తులో పెళ్లి కుమారుడు, కుమార్తె వయస్సు తెలియజేయాలి.
  • పెళ్లి కుమారుడు, కుమార్తె తరపున ఇద్దరిద్దరు సాక్షులు వివాహాల అధికారి సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది.
  • వివాహాల అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిష్టర్‌లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు.
  • పెళ్లి జరిగే చోట, లేదా మన ఇంటి వద్ద కూడా వివాహం నమోదు చేసుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం వివాహాల అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • వివాహ నమోదు పత్రం (సర్టిఫికెట్‌)పై వివాహాల అధికారి సంతకం, సీలు వేసి దంపతులకు ఉచితంగా అందజేస్తారు.
  • వివాహాల నమోదు రిజిష్టర్‌లో నమోదైన వివాహాల సమాచారం తెలుసుకోవాలంటే నిర్ణీత ఫీజు చెల్లించి పొందవచ్చు.
  • వివాహం జరిగిన 30 రోజుల తరువాత ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే జరిగిన నాటి నుంచి రెండు నెలలలోపు రూ.100 ఫీజుతో నమోదు చేసుకునే అవకాశం ఉంది.
 
వివాహం ఎందుకు నమోదు చేసుకోవాలి..?
  • ఈవిధంగా నమోదు చేసుకుంటే చట్టబద్ధత ఉంటుంది.
  • కుటుంబానికి సంబంధించిన అన్నిపథకాలు వర్తించేందుకు ఇదెంతో దోహదపడుతుంది.
  • భర్త నుంచి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు ఆధారంగా ఉపయోగపడుతుంది.
  • కట్నం వేధింపుల సందర్భంగా నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా పనికి వస్తుంది.
  • హింస, వేదనకు గురైన లేదా గురవుతున్న మహిళలు విడాకులు పొందడానికి అవసరం. విడాకులు కోరే భర్త కూడా వివాహం జరిగిన ఆధారం చూపాల్సి ఉంటుంది.
  • రెండో వివాహాన్ని అడ్డుకోవడానికి మహిళలు, పురుషులిద్దరికీ ఇదొక ముఖ్యమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
  • ప్రేమ పేరుతో మోసాలు, రహస్య వివాహాలు, సాక్ష్యాలు, రుజువు లేని వివాహాలను నిలిపి వేయడానికి ఇదొక ఆధారంగా పనికి వస్తుంది.
  • బాల్య వివాహాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
  • వివాహ నమోదు చట్టం ఆధారంగా మహిళలు ఇతర సంబంధిత చట్టాల నుంచి త్వరగా తీర్పు పొందే అవకాశం ఉంటుంది.
 
తప్పుడు సమాచారం ఇస్తే...?
  • ఉద్దేశపూర్వకరంగా, లేదా తెలిసినా నిర్లక్ష్యంతో వివాహం నమోదు చేసు కోని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు.
  • వివాహ నమోదు పత్రంలో తెలిసి/ మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా, లేదా ఈ రెండూ అమలు చేస్తారు.
  • వివాహం నమోదు చేయని వివాహాల అధికారికి మూడు నెలల జైలుశిక్ష, లేదా రూ.500 జరిమానా, లేదా ఈ రెండు శిక్షలు అమలు చేస్తారు.
 

 

 

matrimonial
Browse Readymade Matrimonial Profiles by
Mother Tongue
Religion
Occupation
Living in
Accountant | Acting Professional | Administration Professional | Advertising Professional | Air Hostess | Animation | Architect | Army | Artist | Audiologist | Auditor | Ayurvedic | Banker | Beautician | Biologist / Botanist | Business Person | CEO | Chartered Accountant | Civil Engineer | Clerical Official | Company Secretary | Computer Professional | Contractor | Customer Support Professional | Defence Employee | Dentist | Designer | Doctor | Driver | DSP | Economist | Electrician | Engineer | Engineer (Mechanical) | Engineer (Project) | Entertainment Professional | Executive | Factory worker | Farmer | Fashion Designer | Finance Professional | Government Employee | Govt.Doctor | Govt.Engineer | Govt.Lecturer | Govt.Teacher | Health Care Professional | Hotel & Restaurant Professional | Human Resources Professional | Interior Designer | Investment Professional | IT / Telecom Professional | Lawyer | Lecturer | Legal Professional | Manager | Marketing Professional | Media Professional | Medical Professional | Medical Transcriptionist | Nil | Non-mainstream professional | Not working | Not Working in Present | Nurse | Occupational Therapist | Pharmacist | Photographer | Physician Assistant | Physiotherapist | Police | Preparing Group-1 | Principal | Production professional | Professor | Psychiatrist | Psychologist | Public Relations Professional | Railway Eployee | Research Scholar | Retail Professional | Scientist | Social Worker | Software Engineer | Student | Sub Inspector | Supervisor | Surgeon | Teacher | Technician | Training Professional | Transportation Professional | veterinary doctor | Volunteer | Working in Govt Sector | Working in Private Sector | Writer |
4
5
matrimonial
`
matrimonial
Tea/Chocolate/Tours
andhraenterprises.com
© Copyright All Rights Reserved 2011-2013 uniwebsol.com